Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి పోలీస్ స్టేషన్‌లలో సమాచారం గోవిందా...!

అంతర్జాల సైబర్ ఎటాక్ తిరుపతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్టేషన్ లలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. సిస్టంలోని మొత్తం సమాచారాన్ని దొంగిలించేశారు. ఏ మాత్రం కంప్యూటర్ ఓపెన్ కాకుండానే చేసేశారు. ప

Webdunia
శనివారం, 13 మే 2017 (18:23 IST)
అంతర్జాల సైబర్ ఎటాక్ తిరుపతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్టేషన్ లలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. సిస్టంలోని మొత్తం సమాచారాన్ని దొంగిలించేశారు. ఏ మాత్రం కంప్యూటర్ ఓపెన్ కాకుండానే చేసేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని 10 పోలీస్టేషన్లలో కంప్యూటర్లు పనిచేయడంలేదు. కంప్యూటర్లు ఆన్ చేస్తే బ్యాక్ స్క్రీన్ కనబడుతూ పాస్ వర్డ్ అడుగుతోంది. దీంతో భయపడ్డ పోలీసులు వెంటనే  తమ సిస్టంలను పార్ట్ పార్టులుగా తీసి పక్కన పడేశారు. ఇలా చేయమని పోలీసు ఉన్నతాధికారులే చెప్పడంతో ఆ పనిచేశారు పోలీసులు.
 
తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిన్న అర్థరాత్రి సమయంలో ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌ను ఐటి విభాగంలో ఉమాశంకర్ అనే వ్యక్తి ఓపెన్ చెయ్యగా ఒక్కసారిగా సిస్టం మొత్తం వైరస్ అటాక్ అయ్యింది. సిస్టం దానికదే ఆఫ్‌ అయిపోయింది. తిరిగి ఆన్ కాలేదు. కొద్దిసేపు తరువాత సిస్టంను ఆన్ చేస్తే బ్యాక్‌స్క్రీన్ వస్తూ పాస్ వర్డ్ అడుగుతోంది. దీంతో వెంటనే ఎస్పీ జయలక్ష్మి దృష్టికి తీసుకెళ్ళారు ఉమా శంకర్. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం తరువాత జిల్లాలో మరో 9 పోలీస్టేషన్లలో ఇదేవిధంగా మారినట్లు సమాచారం అందింది. దీంతో డిజిపి దృష్టికి చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తీసుకెళ్ళారు. 
 
ఒక్క తిరుపతితే కాదు విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళంలో ఇదే విధంగా జరిగింది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో హ్యాక్ అయిన కంప్యూటర్లలోని మొత్తం డేటా తమ వద్ద ఉందన్నారు ఎస్పీ జయలక్ష్మి. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments