Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్ - పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

సెల్వి
శనివారం, 5 అక్టోబరు 2024 (09:29 IST)
పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ కొనసాగుతోంది. సనాతన ధర్మం.. పేరుతో ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య.. యుద్ధం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సనాతన ధర్మం అనేది మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదంటూ... ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయినిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు. 
 
తాజాగా ఉదయనిధిపై పవన్ కౌంటరిచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాను సనాతన హిందువునని, అలాంటి వ్యక్తులు రావచ్చు, పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని, దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. ఉదయ్ నిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయం నిధి స్టాలిన్ స్పందించారు.

సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై... స్పందిస్తూ వెయిట్ అండ్ సి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే.. పవన్‌ కళ్యాణ్‌‌పై మధురై పోలీస్‌ కేసు అయింది. ఓ లాయర్‌ ఈ కేసు పెట్టారు. ఉదయ్‌ నిధి స్టాలిన్‌‌పై వ్యాఖ్యలు.. రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే ధోరణితో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయింది. మరీ దీనిపై పవన్‌ ఎలా రియాక్ట్‌ అవుతారనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments