నేడు విజయవాడ వరద బాధితులకు వరదసాయం పంపిణీ : సీఎం చంద్రబాబు

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:14 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగడంతో సంభవించిన వరదలతో విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయింది. ఈ వరద బాధితులకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటించారు. ఈ వరద సాయం పంపిణీని విజయవాడ కలెక్టరేట్ నుంచి పరిహార చెల్లింపులు సీఎం ప్రారంభిస్తారు. 
 
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తుంది. ఈసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మునుపెన్నడూ లేనివిధంగా విజయవాడ వరదలకు అతలాకుతలం అయ్యింది.
 
ఈ క్రమంలో 10 రోజులు పాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు మకాం వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని నడిపించారు. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యుమరేషన్ పూర్తి చేసింది. బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి పరిహారం విడుదల చేయనున్నారు. అర్హులైన బాధతులందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారం డబ్బులు జమ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments