Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 24 గంటల పాటు మందు... షాపింగ్ మాల్స్... థియేటర్లు... ఆన్‌లైన్ సేవల పుణ్యమే!

ఇకపై ఎప్పుడైనా...ఎక్కడైనా... ఏ అర్థరాత్రైనా నచ్చిన సమయంలో నచ్చిన సినిమాను చూడొచ్చు... నచ్చిన రెస్టారెంటులో లాగించొచ్చంటోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినేట్ బుధవారం 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (09:01 IST)
ఇకపై ఎప్పుడైనా...ఎక్కడైనా... ఏ అర్థరాత్రైనా నచ్చిన సమయంలో నచ్చిన సినిమాను చూడొచ్చు... నచ్చిన రెస్టారెంటులో లాగించొచ్చంటోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినేట్ బుధవారం 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్' కు మద్దతునిచ్చింది. 24 గంటలు, 365 రోజులు... సినిమా హాల్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఇతర సర్వీస్ కేంద్రాలు తెరిచి ఉంచే అవకాశాన్ని కల్పించింది. 
 
పది మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉండే ఏ సంస్థ అయినా ఇక నుంచి 24 గంట‌లు తెర్చుకునే అవకాశముంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యాక్ట్‌ను అమలు చేసేందుకు దీనిని కేంద్రం రూపొందించింది. ఆన్‌లైన్ సేవలు వచ్చిన తర్వాత రీటైల్ రంగం మందగించిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా 24 గంటలు పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు, అయితే వారికి సరైన రక్షణ, వసతులు, రవాణా సదుపాయాలు, ఇతర సర్వీసులు ఉండాలని కొన్ని నిబంధనలు చేర్చారు. 
 
మారుతున్న కాలానికి అనుగుణంగా... వివిధ రాష్ట్రాల కోరిక మేరకు ఈ చట్టానికి ఆమోదం తెలుపుతున్నామని, ఇదే సమయంలో దేశమంతటా ఒకే రకమైన వర్కింగ్ కండిషన్స్ కోసమూ చట్టం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాత్రిపూట మ‌హిళ‌లు షాపుల్లో ప‌నిచేసే వెస‌లుబాటు కూడా క‌ల్పించ‌నున్నారు. క్యాబ్ స‌ర్వీసులు ఉన్న కంపెనీల్లో ఇక నుంచి మ‌హిళ‌లు కూడా రాత్రి పూట ప‌నిచేయ‌వ‌చ్చు.
 
ఇప్పటివరకూ షాపులు, మాల్స్ ఓపెనింగ్, క్లోజింగ్ సమయాలు రాష్ట్రాల చేతుల్లో ఉండగా, ఇకపై సమయపాలన ఉండదని, పరిస్థితులను బట్టి నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉంటుందని వివరించారు. షాపింగ్ మాల్స్‌ను వారం మొత్తం తెరిచి ఉంచిన‌ప్పుడు చిన్న చిన్న షాపుల‌ను కూడా ఎందుకు తెరువ‌రాద‌ని ఇటీవ‌ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న విష‌యం తెలిసిందే. కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఎప్పుడైనా సినిమా చూస్కోవచ్చు, ఏ రాత్రైనా రెస్టారెంటుకు వెళ్లి తినచ్చు, ఏ మాల్‌కైనా వెళ్లి షాపింగ్‌ చేసుకోవచ్చని అంటోంది కేంద్ర ప్రభుత్వం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

రా రాజా లాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయడం చాలా గొప్ప విషయం : జేడీ చక్రవర్తి

L2 ఎంపురాన్ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్

నవ్వించడానికి మ్యాడ్ గ్యాంగ్ తో మ్యాడ్ స్క్వేర్ టీజర్ వచ్చేసింది

NTR Japan: జపనీస్ మీడియా కోసం ఇంటర్వ్యూలతో దేవర ప్రమోషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments