Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్... పరారీలో వనిత

హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:54 IST)
హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. ఆయన భార్య వనితా రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెతో పాటు ఆమెకు సహకరించిన న్యాయవాది కూడా ఫోనులోకి అందుబాటులో లేడు. దీంతో విజయ్ ఆత్మహత్య కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. 
 
ఇటీవల సూసైడ్ చేసుకున్న విజయ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇన్నాళ్లూ తన భర్త మృతి చెందడానికి తనకూ సంబంధం లేదని చెప్పిన వనితా రెడ్డి పోలీసుల కంట పడకుండా తప్పించుకుతిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణలో భాగంగా వనితారెడ్డి ఇంటికి వెళ్లగా, తన కూతురికి అనారోగ్యంగా ఉందని వనిత తల్లి చెప్పినట్లు తెలిసింది. 
 
అయితే వనితారెడ్డి సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమె తప్పించుకోవడానికి యత్నిస్తుందేమోనని అనుమానిస్తున్నారు. న్యాయవాది శ్రీనివాస్ కూడా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, అరెస్ట్ చేయాలని విజయ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments