Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జరిగాయి. నిజానికి ఓ కోడి పందేల నిర్వహణపై అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (10:45 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జరిగాయి. నిజానికి ఓ కోడి పందేల నిర్వహణపై అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి కోడి పందేల నిర్వహణ యధేచ్చగా సాగింది. 
 
అయితే, ఈ కోడి పందేల కోసం పెంచిన కోడి పుంజులకు పందేలకు ముందు మహారాజుల్లాగా బతికాయి. ఉదయాన్నే జీడిపప్పు, బాదంపప్పు నుంచి చికెన్, మటన్ వరకూ లాగించినవే. కానీ ఇప్పుడు లాకప్‌లో అన్నమో రామచంద్రా అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఈ కోడి పుంజులకు తిండి పెట్టలేక పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. దీనికంతటికీ గల కారణాలను పరిశీలిస్తే, 
 
సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి 9 పుంజులను, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న కోడిపుంజులను తీసుకెళ్లి న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచారు. అయితే, నిందితులందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి విడుదల చేశారు. ఈ పుంజులతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్‌లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండిపోతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments