Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజన గాయాలు మానలేదు... ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్-సీఎం జగన్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (12:15 IST)
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత మూడేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో సాగుతున్నాయన్నారు. 
 
ఈ విషయంలో కేంద్రం సహకారం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. విభజన వల్ల ఏర్పడిన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోలుకోలేదని, ఆ గాయాలు మానేందుకు రాష్ట్రానికి సహకరించాలని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. 
 
రాష్ట్రానికి మంజూరైన ప్రతి రూపాయి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహాయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన గాయాలు మానలేదని.. కాబట్టి దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండంటూ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments