Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మంత్రివర్గంలో ఆ ఇద్దరికీ నో బెర్త్

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (10:10 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. గత డిసెంబరు నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్... తనతో పాటు ఒక్కరినే మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కల్పించారు. ఇపుడు తన మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నారు. ఇందులోభాగంగా, కేవలం ఆరు లేదా ఏడుగురు సభ్యులతో ఆయన మినీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 
అయితే, ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో తన కుటుంబ సభ్యులైన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులకు స్థానం కల్పించడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇందులో కేటీఆర్‌ను ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిమించారు. అలాగే, హరీష్ రావుకు కూడా ఏదో ఒక కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, ఈసారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. కుల సమీకరణాలు, జిల్లాలు, ఎన్నికల్లో మెజారిటీ, పనితనం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న చాలా మందికి ఈ దఫా మొండిచేయి చూపించవచ్చనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments