రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినికి సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశానికి మంత్రి రజిని హాజరయ్యారు. ఇదే రోజు రజిని పుట్టిన రోజు అని తెలుసుకున్న సీఎం జగన్ మంత్రి విడుదల రజినికి మిఠాయిలు తినిపించి విషెస్ తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం నుంచి ఆశీస్సులు అందుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఏపీ హోం మంత్రి తానేటి వనిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆమెకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమెకు జగన్ తొలి కేబినెట్‌లోనే మంత్రి పదవి
జగన్ తొలి కేబినెట్‌లో స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రమోషన్ దక్కి ఏకంగా హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
శుక్రవారం నాడు తన జన్మదినం సందర్భంగా ఆమెకు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు బర్త్ డే విషెస్ తెలపగా... సీఎం జగన్ నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె సచివాలయానికి స్వీట్ బాక్స్‌తో వెళ్లారు.
Taneti_Jagan
ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్.. స్వయంగా ఓ మిఠాయిని తీసుకుని ఆమెకు తినిపించారు. ఈ ఫొటోను ఆమె కార్యాలయం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.