Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:55 IST)
సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైకాపా) చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఇందుకోసం ఆడియో రికార్డుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, శ్రీధర్ రెడ్డితో ఫోనులో మాట్లాడిన రామశివారెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో సమావేశమై కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఇప్పటికే రామశివారెడ్డి కాల్ డేటాను సేకరించినట్టు సమాచరాం. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments