Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి : ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (17:58 IST)
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ఈ మధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో... 
 
'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గానగంధర్వుడు మా రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సెప్టెంబరు 25 శుక్రవారం ఆయన పరమపదించారు. ఆయన అకాల నిష్క్రమణం అభిమానులను, ప్రముఖులను కలతకు గురిచేయడమే కాదు, అంతర్జాతీయ సంగీత రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. గత 50 ఏళ్లుగా ఆయన ప్రపంచ సంగీత పరిశ్రమపై చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుంచి ధారాపాతంగా జాలువారుతున్న సుసంపన్నమైన నీరాజనాలే ఆయన ఘనతకు కొలమానాలు.
 
ఆయన ఘనతలు సంగీతాన్ని మించినవి. అసమాన ప్రతిభతో స్వరాల కూర్పును ఆయన ఉత్కృష్టస్థాయికి తీసుకెళ్లారు. ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష 40 వేలకుపైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అనేక పురస్కారాలతో ఆయనను గౌరవించాయి.
 
అంతేకాదు, ఆరుసార్లు దక్షిణభారత ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా పొందారు. 2016లో ఆయనను 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' గా గుర్తించి 'సిల్వర్ పీకాక్ మెడల్' బహూకరించారు. ఆయన సంగీత సేవలకు ప్రతిగా భారత కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.
గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు నివాళి అర్పించాలి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా 5 దశాబ్దాల పాటు ఆయన అందించిన సంగీత సేవలకు ఇదే అత్యున్నత గుర్తింపు అవుతుంది" అంటూ సీఎం జగన్ తన లేఖలో వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments