సీఎం జగన్ సంచలన నిర్ణయం.. వారికి కారుణ్య నియామకాల ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:21 IST)
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అన్నారు. 
 
వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకంపై సీఎం సీమీక్షించారు.
 
ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 కొత్త పీహెచ్ సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు. 
 
జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments