Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలు.. బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకకు బాబు రావట్లేదు..

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (21:38 IST)
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితిని సమీక్షించడంలోనూ, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలతోనూ బిజీగా ఉన్నారు. దాంతో, హైదరాబాదులో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుక కార్యక్రమానికి రాలేకపోతున్నాంటూ ఓ సందేశాన్ని చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
 
"సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు. ఏపీలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున... హైదరాబాదులో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను." అని చంద్రబాబు అన్నారు. నందమూరి బాలకృష్ణ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
 
కుండపోత వర్షాలతో విజయవాడ నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానిక వెళ్లి బాధితులను పరామర్శించారు. 
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వరద సహాయ చర్యలను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం... ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments