ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తాం.. చంద్రబాబు

సెల్వి
మంగళవారం, 7 అక్టోబరు 2025 (11:44 IST)
CBN
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రూ. 15 వేలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. వారికి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు. 
 
అనంతరం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త వినిపించారు. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉండేలా ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి వాటి ద్వారా బుకింగ్‌లు వచ్చేలా చూస్తామని అన్నారు. 
 
ఇలా యాప్ అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులు ఆటో కోసం ఆటో స్టాండుకు వెళ్లి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. 
 
ఇందుకోసం డ్రైవర్లు ఎవరికి కమిషన్లు కూడా చెల్లించే పని లేదు. ఆటో డ్రైవర్లతో పాటుగా మాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు కూడా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వారంతా క్రమశిక్షణగా ఉండాలన్నారు. రూల్స్ అతిక్రమించవద్దని.. క్రమశిక్షణతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments