27న విజయవాడలో చేపల మార్కెట్ మూసివేత

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:18 IST)
విజయవాడ నగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే క్రమములో చేపల మార్కెట్ ల వద్ద అధిక రద్దీ ఉంటున్న దృష్ట్యా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాలననుసరించి ది. 27-09-2020న  ఆదివారం నగరంలో అన్ని చేపల మార్కెట్లను మూసి వేయుటం జరుగుతుందని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు.
 
నగరపాలక సంస్థ పరిధిలోని బెసెంట్ రోడ్ మహంతి మార్కెట్, కొత్తపేట, చిట్టినగర్, సింగ్ నగర్, పాయకాపురం, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట మొదలగు ప్రాంతాలలో గల చేపల మార్కెట్లను పూర్తిగా మూసివేయుట జరుగుతుందని తెలియజేసారు.

నగర వీదులలో చికెన్, మటన్ విక్రయాల దారులు అధికారులతో సహకరించి covid నిబంధనలు పాటిస్తూ, వినియోగదారులు  విధిగా సామజిక దూరం పాటించేలా చూడాలని మరియు మాస్క్ లు, శానిటైజర్ అందుబాటులో ఉంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉదయం గం. 6.00 నుండి 11.00 గంటల వరకు మాత్రేమే విక్రయాలు చేసుకోవాలని అన్నారు.

సమయం పాటించకుండా వ్యాపారం కొనసాగించిన వారిపై కఠిన చర్యలు తిసుకోనబడునని, అటువంటి షాపులను సిజ్ చేయుట జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా రోడ్ల పై చేపలు, రొయ్యలు మొదలగు వాటిని విక్రయించిన యెడల అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

చికెన్ షాపుల వారు వ్యాది సోకిన/ చనిపోయిన కోళ్ళు విక్రియించరాదని అట్లు విక్రయాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారి యొక్క షాపు లైసెన్స్ రద్దు పరచుట జరుగునని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments