Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డివాము వద్ద అనుమానాస్పదంగా సీఐడీ డీఎస్పీ మృతదేహం!!

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (10:34 IST)
రాజమండ్రిలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీస్ శాఖలో ఎస్ఐ విధుల్లో చేరి సీఐడీ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ఓ పోలీస్ అధికారి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని ఓ గడ్డివాము వద్ద అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. తొలుత ఆయనను గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఆ తర్వాత ఆయనను డీఎస్పీగా స్థానికులు గుర్తించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. గాంధీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎంటీ గోదాము సమీపంలో సాయిబాబా గుడివద్ద ఓ మృతదేహం పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన ఫోటోను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేయగా, కొద్దిసేపటికే ఆయన కర్నూలు జిల్లా ఆప్సరికి చెందిన  సీఐడీ డీఎస్పీ నాగరాజు (54)గా గుర్తించారు. 
 
ఈయన యేడాది క్రితం రాజమండ్రిలోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి బదిలీ అయ్యాడు. స్థానికంగా ఉండే ఓ లాడ్జీలో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో గత యేడాది డిసెంబరు నుంచి మెడికల్ లీవులో ఉన్నారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు నుంచి రాజమండ్రికి వచ్చారు. లాడ్జిలోనే బస చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన తన కుటుంబ సభ్యులతో చివరగా మాట్లాడారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 
 
ఈ విషయం తెలిసి హైదరాబాద్ నగరంలోని ఆయన కుమారుడు వంశీకృష్ణ గురువారం రాజమండ్రికికి చేరుకుని తండ్రి గురించి వాకబు చేశారు. దీంతో నాగరాజు విధులకు హాజరుకావడం లేదని మిగిలిన సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన ఫోటోలు సీఐడీ సిబ్బంది గుర్తించి ప్రకాశం నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాగరాజు మృతి విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments