Webdunia - Bharat's app for daily news and videos

Install App

షటిల్ ఆడుతూ క్షణాల్లో కుప్పకూలిన సీఐ.. ఊపిరి తీసుకునేలోపే..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (12:41 IST)
Shuttle
షటిల్ ఆడుతూ సీఐ క్షణాల్లో కుప్పకూలిపోయాడు. పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. రోజులానే షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందారు. సీఐ మృతితో సహచర సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.
 
గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్‌ ఆడుతూ కుప్ప కూలిపోయారు. సర్వీస్‌ చేసిన వెంటనే ఆయాసం రావడంతో.. ఊపిరి తీసుకునేలోపే.. నేలపై పడిపోయారు. అప్పటివరకు ఆడుతున్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగా.. అప్పటికే ఆయన ఊపిరి ఆగిపోయింది. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. 
 
తూర్పు గోదావరి జిల్లా కరప వద్ద సజ్జాపురపుపాడుకు చెందిన భగవాన్‌ ప్రసాద్‌ 2003లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని తపించేవారు. ఈ క్రమంలో 2007లో రిజర్వుడు ఎస్‌ఐగా ఎంపికై జిల్లాలోని గణపవరం, తాడే పల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2018లో సీఐగా పదోన్నతి పొంది కుక్కునూరులో పనిచేశారు.
 
2019 నుంచి రెండేళ్లుగా గణపవరంలో సీఐగా ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్‌ చూపించేవారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల కష్టాలను ఎంతో ఓపిగ్గా విని.. వారి సమస్యలను పరిష్కరించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments