Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై సోము వీర్రాజు ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:45 IST)
విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూధర్మ ప్రచార కార్యక్రమాల్లో క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా, పాలకుల అలసత్వం - అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతోందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు.
 
దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం, ఈ ఘటనపై ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మత ప్రచార బోధకులు ఇంద్రకీలాద్రి చుట్టూ 'అన్యమత ప్రచారం సాగిస్తూ, మతమర్పిడులు ప్రోత్సహిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఈ సంఘటనలపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
 
శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఏడో తేది రాత్రి 8 గం.ల నుండి 9 గం.ల మధ్యలో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. దేవీ నవరాత్రుల ప్రచారం కోసం దేవాలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రచార ఎల్.ఇ.డి. డిజటల్ వ్యాను ద్వారా క్రైస్తవ అన్యమత ప్రచారం దేవాలయ పరిసరాల్లో జరిగింద‌ని పేర్కొంటున్నారు. హిందూ సమాజానికి అత్యంత ప్రమాదకరమైన ఈ పరిణామాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండిస్తూ , క్రైస్తవ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిన దేవాలయ పాలక మండలి పైన, అధికారుల పైన, వ్యాను కాంట్రాక్టరు, సిబ్బందిపైన వెంట‌నే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments