Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:25 IST)
చిత్తూరు జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కార్వేటినగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కార్వేటి నగరం మండపం ఎంఎం విలాసం పంచాయతీ పరిధిలోని గుండ్రాజు ఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి అనే వ్యక్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నాడు.
 
అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడమేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను మూడు రోజుల క్రితం గురుమూర్తి కార్వేటినగరంలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. 
 
శ్రావణి ఒక రోజు రాత్రంతా ఆయనతోనే ఉన్నది. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రావణి వంట గదికి గడియపెట్టి ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments