Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆ విషయంలో వెనక్కు తగ్గు... చిరంజీవి లేఖపై బాబు స్పందిస్తారా?

ప్రజారాజ్యంలో కాంగ్రెస్ పార్టీని కలిపేసిన తరువాత చిరంజీవికి అన్నీ కష్టాలే. పేరుకే రాజ్యసభ్య సభ్యుడైనా పార్టీ అధికారం కోల్పోయిన తరువాత సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు ఈయన. రాజకీయాల్లో పెద్దగా కనిపించకుండా తిరిగారు. ఎవరిపైనా విమర్శలు చేయకుండా అస్సలు

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:23 IST)
ప్రజారాజ్యంలో కాంగ్రెస్ పార్టీని కలిపేసిన తరువాత చిరంజీవికి అన్నీ కష్టాలే. పేరుకే రాజ్యసభ్య సభ్యుడైనా పార్టీ అధికారం కోల్పోయిన తరువాత సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు ఈయన. రాజకీయాల్లో పెద్దగా కనిపించకుండా తిరిగారు. ఎవరిపైనా విమర్శలు చేయకుండా అస్సలు తాను రాజకీయాల్లో ఉన్నానా అన్న విషయాన్ని మరిచిపోయి సినిమావైపే ఎక్కువ దృష్టి పెట్టారంటే చిరు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారో చెప్పనవసరం లేదు.
 
చిరు పార్టీ పెట్టిన తరువాత మొదటగా తిరుపతి అసెంబ్లీ నుంచే పోటీ చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును ఇవ్వడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ ఓట్లతో గెలిచిన చిరు అభివృద్థి చేయకుండానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తిరుపతి ప్రజలకు అస్సలు ఇష్టం లేదు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చివరకు చిరంజీవి దేనిపైనా పెద్దగా స్పందించలేదు. అలాంటి చిరంజీవి మొదటిసారి తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీ వాసుల కష్టాలపై స్పందించారు.
 
ఒక పేజీ లేఖను రాసిన చిరంజీవి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపారు. స్కావెంజర్స్ కాలనీ వాసులు ఎన్నో యేళ్ళుగా ఇదే ప్రాంతంలో ఉన్నారని, వారి సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం బలవంతంగా ఉన్న ప్రాంతం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుండటం దారుణమని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఎపిలో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోని చిరంజీవి స్కావెంజర్స్ కాలనీ వాసుల సమస్యలపై స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులోను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చిరంజీవి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే చిరంజీవి లేఖపై చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ స్పందించలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments