Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్... చింటూ సాయం తీసుకున్న అధికార పార్టీ నేత...? రూ. 3 కోట్ల డీల్...?

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (16:04 IST)
చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ పలువురు టీడీపీ నేతలకు సాయపడినట్లు పోలీసులు విచారణలో వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తుండగా పలు విషయాలు వెల్లడయినట్లు సమాచారం. చిత్తూరులో అధికార పార్టీలో ఉంటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ నేత ఇటీవల చింటూ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ముంబయిలో తనకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి మాఫియా ద్వారా చింటూ సెటిల్ చేసినట్లు, చింటూ అనుచరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనికి ప్రతిఫలంగా చింటూకు ఆ నేత విదేశీ తుపాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న చింటూ భారతదేశానికి సమీప దేశాల్లోని ద్వీపాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments