Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో కేసులో ఎస్సై, కానిస్టేబుల్ స‌స్పెన్ష‌న్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (17:47 IST)
అవినీతి ఆరోపణల కేసులో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్‌పై కృష్ణా ఎస్పీ సస్పెన్షన్ విధించారు. పోలీస్ అంటే ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంద‌ని, వారికి సమస్య వస్తే వెంటనే ఆశ్రయించేది పోలీసుల‌నే అని, అలాంటి పోలీస్ శాఖ పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఏ సిబ్బంది వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ స్ప‌ష్టం చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, సిబ్బంది సొంత ప్రయోజనాలకు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడమే కాక, క్రిమినల్ కేసులు నమోదు చేయ‌డానికి వెనుకాడబోనని హెచ్చరికలు జారీ చేశారు.

అక్ర‌మ మద్యం స‌ర‌ఫ‌రా చేసిన కేసులో అడిగినంత లంచం ఇవ్వకుంటే మ‌రిన్ని బ‌నాయిస్తామని, ఒక యువకుడిని చిల్ల‌క‌ల్లు కానిస్టేబులు బెదిరించాడు. దీనితో ఆ యువకుడు ఓ సెల్ఫీ వీడియో తీసి మ‌రీ పోలీసుల దాష్టీకాన్ని వివ‌రించాడు. అనంత‌రం అత‌ను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీనికి కారణమైన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎం.శివరామ కృష్ణ ప్రసాద్‌ను స‌స్పెండ్ చేశారు.

అంతే కాకుండా సిబ్బంది విధులు పట్ల సరైన పర్యవేక్షణ లేకుండా పోయినందుకు చిల్లకల్లు ఎస్ఐ కె.దుర్గా ప్రసాద్ రావుపై సస్పెన్షన్ వేటు విధిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments