Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు విసిరేసి... చేతులు తెగ్గోసుకుని... పరిశీలక బాలుర వింత నిరసన

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (07:08 IST)
వారందరూ.. వివిధ నేరాలలో నిందితులుగా ఉంటూ పరిశీలనా గృహంలో ఉన్న వారు. ఒక్క సారిగా తిరగబడ్డారు. తమను వెంటనే విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరిని ఇప్పటికిప్పుడు కుదరదన్నందుకు భోజనాలు విసిరేశారు... గాజు పెంకులతో చేతు కోసుకున్నారు.. నానా బీభత్సం సృష్టించారు. తిరుపతి పరిశీలక బాలల వసతి గృహంలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి పరిధిలోని మంగళం వద్ద ప్రభుత్వ బాల నేరస్తుల వసతి గృహం ఉంది.  ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాల నేరస్తులు ఉన్నారు. సోమవారం రాత్రి విచారణ నిమిత్తం న్యాయస్థానం బెంచ్ క్లర్క్ వచ్చారు. అయితే అప్పటికే కూడబల్కుని ఉన్న బాలలు తమను తక్షణం విచారించి విడుదల చేయాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కేసులు ఎక్కువగా ఉన్నందున సత్వర విడుదల సాధ్యపడదని క్లర్క్ చెప్పడంతో వారు రెచ్చిపోయారు. 
 
ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరిపి వారి విడుదలకు సహకరిస్తామని సర్దిచెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments