Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల విద్యార్థినిపై పీఈటీ అసభ్య ప్రవర్తన.. స్కూలుకెళ్లేందుకు ఏడ్వటంతో..?

చిన్నారులపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల పట్ల కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎఫ్‌సీ, ఈసీఐఎల్‌ లాంటి కంపెనీల ఉద్యోగుల పిల్లలు చదివే విద్యాసంస్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (09:19 IST)
చిన్నారులపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల పట్ల కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎఫ్‌సీ, ఈసీఐఎల్‌ లాంటి కంపెనీల ఉద్యోగుల పిల్లలు చదివే విద్యాసంస్థల్లో సైతం విద్యార్థినులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. హైదరాబాదులో చిన్నారులపై దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. అసభ్యప్రవర్తనతో విద్యార్థినులను వేధిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ (డీఏవీ) పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని (8)తో ఆ పాఠశాలకు చెందిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) చంద్రశేఖర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
రోజూ హుషారుగా వెళ్లే ఆ విద్యార్థిని సోమవారం పాఠశాలకు వెళ్లడానికి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు కారణం ఆరాతీశారు. దీంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పిన చిన్నారి.. పీఈటీ చంద్రశేఖర్‌పై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments