Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క ప్రియుడితో వెళ్తానని తెగేసి చెప్పేసింది.. చెల్లి బోరుమంది.. ఎస్పీ నేనున్నానంటూ..?

అవును వాళ్ళిద్దరూ సిస్టర్స్. తల్లిదండ్రులు లేరు. అక్కే చెల్లాయి బాగోగులు చూసుకునేది. అయితే ఇంతలోనే ప్రేమించిన యువకుడితో జీవితం పంచుకునేందుకు అక్క సిద్ధమైపోయిది. దీంతో అక్క వెళ్ళిపోతుండటంతో తనకెవరు దిక

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:33 IST)
అవును వాళ్ళిద్దరూ సిస్టర్స్. తల్లిదండ్రులు లేరు. అక్కే చెల్లాయి బాగోగులు చూసుకునేది. అయితే ఇంతలోనే ప్రేమించిన యువకుడితో జీవితం పంచుకునేందుకు అక్క సిద్ధమైపోయిది. దీంతో అక్క వెళ్ళిపోతుండటంతో తనకెవరు దిక్కు అంటూ చెల్లి బోరున విలపించింది. కానీ ఆ సమయంలో చిక్కమంగళూరు ఎస్పీ ఆ అమ్మాయికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అక్క ప్రియుడితో వెళ్తుంటే చెల్లి ఏడుస్తూ విలపిస్తుంటే.. సాక్షాత్తు జిల్లా ఎస్పీ ముందుకువచ్చి అన్నయ్య నీ బాగోగులు చూసుకుంటానంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే చిక్కమంగళూరులో ఓ కుటుంబంలోని అక్కాచెల్లెళ్ళు ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా గడిపేవారు. ఉద్యోగం చేస్తున్న అక్క చెల్లాయి విద్యాభ్యాసం బాగోగులన్నీ తానే చూసుకొనేది. కొద్దికాలంగా అక్క ఓ యువకుడి ప్రేమలో పడింది. కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరింది. ఎస్పీ కె.అణ్ణామలై విచారణ జరిపిన సమయంలో తాను ప్రేమించిన యువకుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో చెల్లి గుండె ఒక్కసారిగా గుబేల్‌మంది. 
 
తల్లీతండ్రిని ఇప్పటికే పోగొట్టుకున్న చెల్లాయి ప్రస్తుతం అక్క కూడా దూరమైపోవడంతో బాధపడింది. తననుంచి అక్కను దూరం చేయవద్దంటూ ఎస్పీ కాళ్లపై పడి ప్రాధేయపడింది. అయితే అక్కడ ప్రేమ వ్యవహారం, చెల్లి దీనగాధ విని చలించిన ఎస్పీకి కాసేపు ఏం చేయాలో తోచలేదు. చివరికి ఆయన చెల్లి బాధ్యతలను తానే స్వీకరిస్తానని ప్రకటించారు. ఆమెకు తాను అన్నయ్యగా ఉంటానని చెప్పాడు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు ఖర్చులన్నింటినీ భరోసా ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments