Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (10:14 IST)
ఏపీ లిక్కల్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న పీఏలు బాలాజీ, నవీన్‌లను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
 
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. కేసులో అరెస్టు చేసిన చెవిరెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీలికో తీసుకుని విచారించనున్నారు. 
 
ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.20 కోట్ల నగదును బాలాజీ తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి పేరు వెలుగులోకి రావడంతో ఆయన పీఏలుగా పని చేసిన బాలాజీ, నవీన్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
అయితే, వారు ఇండోర్ నుంచి ఏపీలోని వైకాపా నేతలకు ఫోన్లు చేస్తూ కేసు పురోగతి, వాస్తవ పరిస్థితిని ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండటంతో సెల్ ఫోన్ సిగ్నల్, లొకేషన్ ఆధారంగా సిట్ పోలీసులు వారి ఆచూకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు ఇండోర్‌కు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments