Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు పెట్టకుంటే మీ అమ్మకు ఆ సెల్ఫీ చూపిస్తా?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (11:51 IST)
అమ్మాయిలు, అబ్బాయిల స్నేహం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పకనే చెప్పే ఘటన ఒకటి తాజాగా జరిగింది. స్నేహంగా ఉన్నపుడు తీసుకున్న ఓ సెల్ఫీని అడ్డుపెట్టుకుని ఓ యువకుడు ఓ యువతిని బలవంతంగా ముద్దు పెట్టాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు ఆ యువతి ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని మడిపాక్కంకు చెందిన ఓ యువతి(18) ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న శ్రీనాథ్ ప్రేమిస్తున్నానని వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే యువతి అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించింది.
 
ఈ క్రమంలో మహాబలిపురానికి వెళ్లిన సమయంలో యువకుడు యువతితో కలిసి సెల్ఫీ దిగాడు. తనకు ముద్దు ఇవ్వాలనీ, లేదంటే ఈ సెల్ఫీని కుటుంబ సభ్యులకు చూపుతానని, సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించాడు.
 
దీంతో భయపడిన ఆ యువతి ముద్దు ఇచ్చేందకు సిద్ధపడింది. ఆమె యువకుడికి ముద్దు ఇస్తుండగా నిందితుడి స్నేహితుడు ఈ తతంగాన్ని ఫొటో తీశాడు. చివరికి అతని వేధింపులు హద్దు దాటడంతో తల్లిదండ్రులకు బాధితురాలు అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనాథ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments