Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా ‘చంద్రన్న బాట’... ఏం చేయబోతున్నారో తెలుసా?

విజయవాడ: రాష్ట్రంలో చేపట్టిన వాడవాడలా చంద్రబాట నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి అధికారం యంత్రాంగం రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి 4,119 కిలో మీటర్ల మేర రోడ్డు ని

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:41 IST)
విజయవాడ: రాష్ట్రంలో చేపట్టిన వాడవాడలా చంద్రబాట నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయడానికి అధికారం యంత్రాంగం రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి 4,119 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటూ వాడవాడలా చంద్రన్నబాట కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
2016-17 ఆర్థిక సంవత్సరంలో 5,170 కిలోమీటర్ల పైబడి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగానున్న 13 జిల్లాల్లో ఉన్న 13 వేల పంచాయతీల్లో 4,119 కిలోమీటర్ల పైబడి రోడ్లు నిర్మించారు. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా సిమెంట్ రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో 3,043 కిలో మీటర్ల సిమెంట్ రోడ్లను లక్ష్యంగా పెట్టుకోగా, 4,111 కిలో మీటర్ల మేర రహదారులు నిర్మించారు. 
లక్ష్యానికి మించి రోడ్లు నిర్మించారు. ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించి సిమెంట్ రోడ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ భావన. దీని కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది.
  
మూడు జిల్లాల్లో వంద శాతానికి చేరువగా నిర్మాణాలు...
దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలన్న బాపూజీ మాటలను నిజం చేస్తూ, సీఎం చంద్రబాబునాయుడు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. సిమెంట్ రహదారుల నిర్మాణంతో గ్రామాలకు రాష్ర్ట ప్రభుత్వం నూతన రూపు తీసుకొస్తోంది. అన్ని గ్రామాల్లోనూ వాడవాడలా చంద్రన్నబాటలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 2016-17లో రూ.2000 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాల్లో మూడు జిల్లాలు 100 శతానికి చేరువగా నిలిచాయి. నెల్లూరు జిల్లాలో 99 శాత మేర చంద్రన్నబాట నిర్మాణాలు పూర్తయ్యాయి. పశ్చిమ గోదావరిలో 97 శాతం, గూంటూరులో 95 శాతం మేర సిమెంట్ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు.
 
జిల్లాల వారీగా చంద్రన్నబాట నిర్మాణాలు
రాష్ట్రంలో ఉన్న 13 వేల పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు సాగుతున్న తీరు పరిశీలిస్తే... అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 436 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఇప్పటివరకూ 345 కి.మీ.లు నిర్మించారు. చిత్తూరులో 203, తూర్పు గోదావరిలో 420 కి.మీ.మేర సిమెంట్ రోడ్లు నిర్మించారు. గుంటూరులో 312, కడపలో 266 కి.మీ., కృష్ణాలో 248 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించారు. ఇక కర్నూలులో 420, ప్రకాశంలో 308 కిలో మీటర్ల మేర సిమెంట్ రహదారులు నిర్మించారు. నెల్లూరు జిల్లా విషయానికొస్తే, 400 కిలో మీటర్లకు గానూ 396 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 296 కిలో మీటర్లలో రహదారులు నిర్మించారు. విశాఖపట్నం జిల్లాలో 294 కి.మీ., పశ్చిమ గోదావరిలో 322 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించారు. విజయనగరంలో 169 కిలో మీటర్ల మేర సిమెంట్ రహదారులను నిర్మించారు. పశ్చిమ గోదావరిలో 450 కిలోమీటర్లకు గానూ 438 కి.మీ. రోడ్లు పూర్తిచేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం