Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్రెడిట్ కోసం గుంట నక్కలా స్కెచ్ వేస్తున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి

Vijayasai Reddy
Webdunia
మంగళవారం, 25 మే 2021 (14:35 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్‌ను కొట్టేసేందుకు చంద్రబాబు గుంటనక్కలా వ్యూహాలు పన్నుతుంటారంటూ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై విజయసాయి మంగళవారం మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుందని విమర్శించారు. అందులోకి ఎలా దూరాలా? అని ఆలోచిస్తాడని అన్నారు. 
 
ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వస్తున్న క్రెడిట్‌ను ఎలా కొట్టేయాలా అని గుంటనక్కలా స్కెచ్ వేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నదీనదాలు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి? అన్న శ్రీశ్రీ మాటలను టీడీపీవారు మరోలా అర్థం చేసుకున్నారని విజయసాయి అన్నారు. 
 
ల్యాండ్ కనిపిస్తే చాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పచ్చజెండా పాతేశారు అని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి... విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడిందని అన్నారు.
 
చంద్రబాబు హయాంలో కార్పొరేట్ హాస్పిటళ్లను పెంచి పోషించేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని... ఈ రెండేళ్లలో సీఎం జగన్ సంజీవనిగా మార్చారని విజయసాయి కొనియాడారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి వచ్చారని... కరోనా, బ్లాక్ ఫంగస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ జగన్ భరోసా కల్పించారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments