Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు : స్వాగతించిన సీఎం చంద్రబాబు

ఠాగూర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (15:10 IST)
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. "తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే.. ఓం నమోద వేంకటేశాయ" అంటూ ట్వీట్ చేశారు. 
 
తిరుమల లడ్డూ కల్తీ వివాదం : స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం 
 
పవిత్ర శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కల్తీ లడ్డూ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం మరోమారు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గగాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కల్తీ వ్యవహారంలో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్ తో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. 
 
సిట్ దర్యాప్తు కొనసాగేలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అనే విషయంపై సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుశార్ మెహతా అభిప్రాయం కోరిన విషయం తెల్సిందే. దీంతో సొలిటర్ జనరల్ సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవని కోర్టుకు తెలిపారు. అయితే, సిట్‌పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా అన్నారు. దీంతో సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలో ఐదుగురు సభ్యులు ఉండాలని తెలిపింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక నిపుణుడు ఉండాలని న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం