Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'ఎన్టీఆర్' నేమ్: హైదరాబాద్ రాజకీయ రాజధాని మాత్రమే!!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (14:59 IST)
బాలకృష్ణ నోట ఎన్టీఆర్ మాట వచ్చింది. తన తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ పేరును అనంతపురం జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు ఆ జిల్లా ఎమ్మెల్యేలతో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. 
 
అంతేగాకుండా.. అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని అయితే, ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు. 
 
కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టకపోతే జిల్లాల డీలిమిటేషన్‍‌లో అనంతపురం రెండు జిల్లాలుగా ఏర్పడుతుందని, అప్పుడు హిందూపురానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుదామని బాలకృష్ణ అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి పాలన ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. షెడ్లు నిర్మించి అయినా పాలన సాగిస్తామన్నారు. తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ రాజకీయ రాజధాని మాత్రమే అన్నారు.
 
పోలవరం పైన వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిది ద్వంద్వ వైఖరి అన్నారు. మంత్రులంతా జనవరి నుండి ప్రతి శనివారం హైదరాబాదులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలంతా సభకు సమయానికి రావాలన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవినీతిరహిత పాలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని హితవు పలికారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments