Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు వెడ్డింగ్ మెమొరీస్... చంద్రబాబు కన్నతండ్రినే తోసేసిన జనం...

ఔను నిజమే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కన్నతండ్రినే గుంపులో తోసేసారట. జనం ఎక్కువగా ఉండటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయారట మన సిఎం. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందనే వివరాల్లోకి వెళ్తే... చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:33 IST)
ఔను నిజమే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కన్నతండ్రినే గుంపులో తోసేసారట. జనం ఎక్కువగా ఉండటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయారట మన సిఎం. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందనే వివరాల్లోకి వెళ్తే...
 
చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ కూతురు భువనేశ్వరిని పెళ్లాడాడనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న బాబు వద్దకు ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ వివాహ ప్రస్తావన తేవడం, కొద్దిగా ఆలస్యంగానైనా బాబు ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. అయితే మద్రాసులో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఊహించని విధంగా ఆహుతులు విచ్చేసారట. ఎన్టీఆర్‌కు సోదర సమానుడు, తమిళ అగ్రనటుడు ఎమ్జీఆర్‌తో సహా, పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు సైతం హాజరయ్యారట.
 
ఇంతమంది ప్రముఖుల తాకిడికి చిత్తైపోయిన భద్రతా సిబ్బంది పొరపాటున పెళ్లికొడుకు నారా చంద్రబాబునాయుడిగారి తండ్రిని కూడా ఎవరో సామాన్యుడు అనుకుని నెట్టేసారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆయనకు క్షమాపణలు చెప్పి వేదిక వద్దకు తీసుకొచ్చారట. ఆ తర్వాత ఏ విఘ్నం లేకుండా వివాహ తంతు సరదాగా గడిచిపోయిందట. ఈ విషయాలన్నీ చంద్రబాబుగారు ఆ మధ్య ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments