Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు నాగార్జున వర్శిటీ టెన్షన్... లోనికెళితే అదేనంట...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతిష్యంపై బాగా నమ్మకం ఎక్కువైందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన దగ్గర్నుంచి ఆయన ఏ పనిచేసినా... ఎక్కడికెళుతున్నా శుభ ఘడియలు, వాస్తు చూసుకుంటున్నారని అనుకుంటున్నారు. తాజాగా ఆయనకు జ్యోతిష్కుడు చెప్పిన మాట ప్రకారం తు.చ తప్పకుండా పాటిస్తున్నారనే సమాచారం తిరుగుతోంది.
 
శీతాకాల సమావేశాలను గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీలో నిర్వహించేందుకు అనువైనదిగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మొన్నీమధ్య ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్లు చెపుతున్నారు. దీనికి కారణం జ్యోతిష్కుల సూచనలనే కామెంట్లు వినబడుతున్నాయి. జ్యోతిష్కులు కొందరు నాగార్జున యూనివర్శిటీలోకి వెళితే నష్టం జరుగుతుందని చెప్పడం వల్లనే అక్కడ అసెంబ్లీ సమావేశాలు వద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఎందుకంటే గతంలో ఆ యూనివర్శిటీకి వెళ్లిన కొందరు రాజకీయ నేతలు ఆ తర్వాత ఇబ్బందిపడ్డారని కొందరు చెపుతున్నారట. ఎందుకొచ్చిన తంటా వెళ్లకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయంలో బాబు ఉన్నారని అంటున్నారు. అందువల్లనే ప్రమాణ స్వీకారం సమయంలో కూడా కార్యక్రమం ముగిశాక  వర్శిటీలో విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసినా ఆయన తొంగి కూడా చూడలేదని అంటున్నారు. అంతేకదా... నమ్మకం బలపడిందంటే అంత తేలిగ్గా విడిచిపెట్టేయడం కుదరదు కదా...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments