Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతో ఆనందం... అంతలోనే చిన్నబోయిన చంద్రబాబు ముఖం... మోదీ వినరు... పవన్ ఆగరు...

విజ‌య‌వాడ‌: 500, 1000 నోట్లు ఒద్ద‌ని నేను ఎప్పుడో చెప్పా... ఇప్ప‌టికి వాటిని ర‌ద్దు చేశార‌ని... శుభ ప‌రిణామం అని... ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న క్రెడిట్‌గా చెప్పుకున్నారు. కానీ, ఆ ఆనందం ఇపుడు ఆవిరైపోయింది. చంద్రబాబు చెప్పింది ఏదీ మోదీ పాటించ‌డం లేద‌ని అర

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (16:47 IST)
విజ‌య‌వాడ‌: 500, 1000 నోట్లు ఒద్ద‌ని నేను ఎప్పుడో చెప్పా... ఇప్ప‌టికి వాటిని ర‌ద్దు చేశార‌ని... శుభ ప‌రిణామం అని... ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న క్రెడిట్‌గా చెప్పుకున్నారు. కానీ, ఆ ఆనందం ఇపుడు ఆవిరైపోయింది. చంద్రబాబు చెప్పింది ఏదీ మోదీ పాటించ‌డం లేద‌ని అర్ధ‌మ‌యిపోయింది. 500, 1000 నోట్లు ర‌ద్దు చేసిన వెంట‌నే ఎంతో సంతోషం అని ఉబ‌లాట‌ప‌డ్డారు. కానీ, మొత్తం ర‌ద్దు చేయ‌లేదు... డిజైన్ మార్చారంతే... మొన్న కొత్త 1000 నోట్ల‌తోపాటు 2000 నోట్లు కూడా తీసుకొచ్చారు. ఇపుడు తాజాగా 500 నోట్లు కూడా కొత్త‌వి తెస్తున్న‌ట్లు కేంద్రం  ప్ర‌క‌టించింది. ఇక చంద్ర‌బాబు మాట ఏం విన్న‌ట్లు? 
 
గడచిన రెండున్నరేళ్లుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇదే పంథా అవ‌లంభిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ఏ విషయం ఆయ‌నా ఆయ‌న పెడ‌చెవిన పెడుతున్నారు. ప్రత్యేక హోదా కావాల‌ని, అది ఏపీలో సెంటిమెంట్‌గా మారింద‌ని, చాలా ఇబ్బందిగా ఉంద‌ని ప‌దేప‌దే ప్ర‌ధానికి చెప్పారు చంద్ర‌బాబు... ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రాధేయ‌ప‌డ్డారు. కానీ ప్ర‌ధాని పెడ‌చెవిన పెట్టారు. ప్ర‌త్యేక హోదా లేద‌ని, ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అది కూడా ఏమంత సంతృప్తి క‌రంగా లేదు... అయినా త‌ప్ప‌ద‌ని బాబు స‌ర్దుకుపోయారు. 
 
త‌ర్వాత రాజధానికి నిధుల సమీకరణ విష‌యంలోనూ మోదీ సానుకూలంగా స్పందించ‌డం లేదు. అమ‌రావ‌తి నిర్మాణం, రెవిన్యూ లోటు భర్తీ, పోలవరానికి నిధులు... ఇలా ఏ ప‌నికీ కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేదు. పైగా, కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ పథకానికి నిధులు మంజూరవ్వాలన్నా, అంతకుముందు విడుదల చేసిన నిధులకు పక్కాగా లెక్కలు అడుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే, అంతా అయోమ‌యప‌రిస్థితి నెల‌కొంటోంది. మరోవైపు 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ బాంబు పేల్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments