Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించనున్న చంద్రబాబు

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:32 IST)
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే సీఐడీ నోటీసులపై బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యే అవకాశం ఉంది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌ను వేయనున్నారు. 
 
కాగా, చంద్రబాబు విషయంలో జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి భూముల అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకుని ఈ నోటీసులను అందజేశారు.
 
అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు.. ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు. 
 
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అలాగే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments