Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో నాని... నేను, ఏంటి పార్టీ మారుతున్నావట.. నానికి చంద్రబాబు ఫోను

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:26 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు జోరుగా కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేశినేని నానితో టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా విజయవాడలో సమావేశమై మంతనాలు జరిపారు. ఆ తర్వాత నాని పార్టీ మారడం లేదంటూ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో కేశినేని నానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి.. తన నివాసానికి రావలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల నియామక విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు నానికి మనస్తాపం కలిగించాయన్నది లోగుట్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
మరోవైపు, నాని బీజేపీలో చేరవచ్చంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమంటున్నారు. ఇపుడు నానికి చంద్రబాబు ఫోన్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. 
 
మొత్తంమీద కేశినేని నాని అంశం ఇపుడు టీడీపీలో కలకలం రేపుతోంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 25 ఎంపీ సీట్లకుగాను కేవలం మూడు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరు కేశినేని నాని. విజయవాడ లోక్‌సభ స్థానం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments