Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే...

వరుణ్
శుక్రవారం, 14 జూన్ 2024 (17:31 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎంతో పాటు పవన్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను సీఎం చంద్రబాబు కేటాయించారు. అలాగే, మంత్రి నారా లోకేశ్‌కు కూడా కీలక శాఖలను కేటాయించారు. హ్యూమన్ రిసోర్స్ (విద్య), ఐటీ ఎక్ట్రానిక్స్, సమాచారం,  ఆర్టీజీ శాఖలను కేటాయించగా, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌కు ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖను కేటాయించారు. 
 
ఆ తర్వాత మంత్రి పవన్‌కు సీఎం చంద్రబాబు శుభకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు. ఏపీ మంత్రివర్గంలోని మంత్రులు అందరికీ శాఖలు కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా శుభకాంక్షలు తెలుపుతున్నాను. మేం అందరం కలిసి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనాశకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా పోర్ట్ ఫోలియోలు అందుకున్న మీరు మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ పవిత్రమైన బాధ్యతలతో కూడిన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న మీకందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments