Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలి.... జపాన్ పారిశ్రామిక వేత్తలకు బాబు పిలుపు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (09:00 IST)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి జపాన్‌‌కు బయలురి వెళ్లారు. ఆయనతోపాటు 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. ఈ సందర్భంగా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్‌లోని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు చంద్రబాబు క్యోటో నగరానికి చేరుకుని, తొలుత అగ్రికల్చర్ మిషనరీ అండ్ ఎక్వీప్‌మెంట్ బిజినెస్ ఎండి నోయోకి కొబాయషితో భేటీ అవుతారు. ఆ తర్వాత ఎన్ఐడిఇసి సమావేశంలో పాల్గొంటారు.

నవంబర్‌ 25వ తేదిన ఓసాకా సిటీకి చేరుకుని, అక్కటి వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. అక్కడే పానాసోనిక్ డివిడి కంపెనీ ప్రతినిధులతో బాబు సమావేశమవుతారు. తర్వాత ఓసాకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌ మీటింగ్‌లో, ఇండియా ఐటీ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం క్యోటో నగర మేయర్‌తో బాబు భేటి అవుతారు. 
 
నవంబర్ 26వ తేదిన నకాటాలో పర్యటించి, వేస్ట్ మేనేజ్‌మెంట్‌ సైట్‌ను పరిశీలిస్తారు. అక్కడే ఉన్న ఫుకూడా టవర్‌ను, కిటక్యూషు సిటీలను కూడా బాబు సందర్శిస్తారు. నకాటా మేయర్‌తోనూ చంద్రబాబు భేటీకానున్నారు. 
 
అనంతరం 27వ తేదిన జపాన్ ప్రధానితో పాటు మంత్రుల బృందాన్ని ఏపీ సీఎం కలుస్తారు. ఇసుజీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇప్పటికే ఇసుజీ కంపెనీ తన ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండడంతో ఈ భేటీలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. జైకా కంపెనీ, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్పొరేషనల్‌ ప్రతినిధులను సైతం కలుస్తారు.
 
ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 28వ తేదిన కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. 29వ తేదిన పర్యాటనను ముగించుకుని బాబు హైదరాబాద్‌కు తిరుగు పయణం అవుతారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments