Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పరిశ్రమల స్థాపనకు టోక్యోలోనే అనుమతులు : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (09:57 IST)
జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆ దేశంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు స్థాపించే జపాన్ పారిశ్రామికవేత్తలకు జపాన్ రాజధాని టోక్యోలోనే అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించారు. 
 
ఇందుకోసం టోక్యోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనుమతులు తీసుకోవడానికి ఆంధ్రాకు రానవసరంలేదని, అన్ని లైసెన్స్‌లనూ ఇక్కడే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
 
కాగా, సోమవారం నుంచి జపాన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు అండ్ కో ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ, కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇందులోభాగంగా.. ఇసుజు కంపెనీ తడలోని శ్రీసిటీ సెజ్‌లో టక్కుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments