Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఓ బచ్చా.. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశా : చంద్రబాబు ఫైర్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (17:33 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ నా ముందు చిన్నపిల్లోడని, ఇలాంటి వారిని చాలామందిని చూసినట్టు చెప్పుకొచ్చారు. అందువల్ల తన వద్ద గీతదాటితే సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సభా కార్యక్రమాలు సజావుగా సాగుకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ వంటి వాళ్లను తాను చాలా మందిని చూశానన్నారు. 
 
ప్రతిపక్ష నేత ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ గీత దాటితే సహించబోనని హెచ్చరించారు. పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానన్నారు. ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని తెలిపారు.
 
జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని ఆయన అన్నారు. కంచి పీఠాధిపతి పుష్కర ఘాట్‌లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లాను తప్ప మరే ఇతర కారణాలూ లేవని స్పష్టం చేశారు. సంతాప తీర్మానాలను కూడా రాజకీయం చేయాలని చూడటం సరైన పరిణామం కాదని చంద్రబాబు హితవు పలికారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments