Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా కోసం ఉడుంపట్టు పట్టిన చంద్రబాబు.. ప్యాకేజీ చర్చల్లో ప్రతిష్టంభన

విభజన హామీ మేరకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ఢిల్లీలో జరిగే ప్రత్యేక ప్యాకేజీ చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడిం

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (14:30 IST)
విభజన హామీ మేరకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబట్టారు. దీంతో ఢిల్లీలో జరిగే ప్రత్యేక ప్యాకేజీ చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది.
 
బుధవారం ఉదయం నుంచి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఏపీకి హోదా బదులు అభివృద్ధి ప్యాకేజీని పూర్తిగా తయారు చేసి, మరికాసేపట్లో మీడియా ముందు పెట్టాలన్న ఆలోచనలో ఉన్న వేళ, ప్యాకేజీ తనకు సమ్మతం కాదని, హోదా ఇవ్వకుండా మరేమిచ్చినా ప్రజలు అంగీకరించరని చంద్రబాబు తేల్చి చెప్పడంతో సుదీర్ఘ కసరత్తు మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది.
 
మరోవైపు.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా చంద్రబాబుతో స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. అయినప్పటికీ చంద్రబాబు నుంచి ఇంకా సమాధానం రాలేదు. ప్యాకేజీలోని అంశాల గురించి తెలుసుకున్న తర్వాతనే ఢిల్లీకి వెళ్లాలా? వద్దా? అన్న విషయాన్ని సహచర మంత్రులతో చర్చించి నిర్ణయించాలని బాబు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments