Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రాజధాని ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు : కేంద్రం క్లారిటీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:46 IST)
నవ్యాంధ్ర రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళంపై కేంద్రం మరోమారు క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. పైగా, విభజన చట్టం మేరకు ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. 
 
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ అంశం ఇపుడు కోర్టు పరిధిలోకి చేరింది. ఈ క్రమంలో రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే  ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ, హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 
 
మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments