Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ్ ప్ర‌భాక‌ర్ అరెస్టుకు ఎఫ్.బి.ఐ.తో ట‌చ్ లో ఉన్న సిబిఐ

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:44 IST)
సోష‌ల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని, నాయ‌కుల్ని, చివ‌రికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పంచ్ ప్ర‌భాక‌ర్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. సోష‌ల్ మీడియా పోస్టుల కేసులో సి.బి.ఐ తాజా అఫిడవిట్ దాఖ‌లు చేసింది. 
 
 
అఫిడవిట్ ను హైకోర్టులో సిబిఐ డైరెక్టర్  జైస్వాల్ ద‌గ్గ‌రుండి దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ ని పిటిషనర్లకు పంపారు. న్యాయమూర్తులను కించపరిచేలా పదే పదే వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్ కోసం నవంబర్ 1న లుక్ఔ ట్ సర్క్యులర్ హోం మంత్రిత్వ శాఖ ద్వారా  జారీ చేశామని సిబిఐ పేర్కొంది. 
 
 
ఇంటర్పోల్ జారీ చేసిన బ్లూ నోటీసు ద్వారా అమెరికాలోని ఎఫ్ బి ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతని చిరునామాను కూడా త‌మ‌కు పంపిందని సి.బి.ఐ. పేర్కొంది. నవంబరు 8వ తేదీన పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధిత కోర్టు నుంచి తీసుకున్న సి.బి.ఐ ఇపుడు ఆ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ నెల 9న ఇంటర్ పోల్ కు పంచ్ ప్రభాకర్ అరెస్టు రిక్వెస్ట్ ను  పంపింది. 
 
 
ప్రభాకర్ అరెస్ట్ కు సంబంధించి ఇంటర్పోల్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని  సీబీఐ పేర్కొంది. పంచ్ ప్రభాకర్ తాజా వీడియోలపై ఈనెల 15న యూట్యూబ్ ఛానల్ తో వర్చువల్ గా సమావేశమైన సిబిఐ అధికారులు, వాటిని మొత్తం తొల‌గించాల‌ని కోరారు. ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారందర్నీ విచారిస్తున్నామని సి.బి.ఐ పేర్కొంది. ఈ కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్ పేరును చేర్చామని సి.బి.ఐ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments