వైఎస్ వివేకా కేసు నిందితులు చంచల్‌గూడ జైలుకు తరలింపు : కోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (14:27 IST)
మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారని నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం ఈ కేసు విచారణ తొలిసారి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సాగింది. దీంతో నిందితులను కడప జైలు నుంచి హైదరాబాద్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు. 
 
అయితే, నిందితుల తరలింపు కష్టంగా ఉందని కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున ఈ కేసులోని ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. 
 
కడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను విచారణ ఉన్న ప్రతిసారీ భారీ భద్రతతో హైదరాబాద్‌కు తరలించడం కష్టతరమని, వీరిని హైదరాబాద్ ‌జైల్లో ఉంచాలని కోర్టును సీబీఐ కోరింది. ఈ విన్నపానికి అంగీకరించిన కోర్టు వారిని చంచల్‌గూడ జైల్లో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, వివేకా హత్య కేసు విచారణను కడప నుంచి హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత తొలిసారి ఈ కేసు విచారణ జరిగింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ముగ్గురు నిందితులైన సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి‌లతో పాటు హైదరాబాద్ నగరంలోని చంచ‌ల్‌గూడా జైల్లో ఉంచాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments