Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త.. మహిళా మేనేజర్‌పై బూతు పురాణం : జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (17:33 IST)
తన ఇలాకాలోని ఒక ఏటీఎం కేంద్రం ముందు చెత్త ఉండటాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో కోపాన్ని నిగ్రహించుకోలేక.. ఏటీఎం సెంటర్‌కు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మహిళా బ్యాంకు మేనేజర్ ఆయన ఇంటికి వెళ్లి.. తాళాలు ఇవ్వాలని కోరింది. అంతే.. ఆమెపై ఒంటికాలిపై లేచిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తిట్లు, బూతు పురాణం అందుకున్నాడు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. మూడు రోజుల క్రితం తాడిపత్రిలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చెత్త ఎక్కువగా పడి ఉండడం చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏటీఎంకు తాళాలు వేసి ఇంటికి తీసుకొచ్చేశారు. దీంతో విషయం తెలిసిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుప్రజ సిబ్బందితో కలిసి తాళం తీసుకోవడానికి జేసీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ బ్యాంకు సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. జేసీ తిట్లతో అవాక్కయిన చీఫ్ మేనేజర్ సుప్రజ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
మునిసిపాలిటీ అభివృద్ధికి విరాళం ఇవ్వలేదని ఎమ్మెల్యే తమను దూషించారని... తనతో పాటు బ్యాంకుకు కూడా జేసీ బ్రదర్స్ నుంచి భద్రత కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు అనేక తర్జనభర్జనలు పడి చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసును నమోదు చేసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments