Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guntur Mirchi Yard: గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన.. జగన్‌పై కేసు నమోదు

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (09:46 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలులో ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా కలెక్టర్ పర్యటనకు వ్యతిరేకంగా ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ, జగన్ మిర్చి యార్డ్‌లోనే కార్యక్రమాన్ని కొనసాగించారు.
 
దీని తరువాత, గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లెల్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్‌లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆరోపించారు.
 
ఎన్నికల కోడ్‌ను అమలు చేయడాన్ని కుట్రగా వైసీపీ చెబుతోంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు… ప్రచారం చేయట్లేదు.. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments