Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుల‌ను కూడా చంద్ర‌బాబు మ్యానేజ్ చేసేస్తారా? మ‌రి స్విస్ ఛాలెంజ్, కారెం శివాజీ కేసులు?

విజ‌య‌వాడ‌ : ఏపీ సీఎం చంద్ర‌బాబు కోర్టుల‌ను మ్యానేజ్ చేయ‌డంలో దిట్ట‌. ఏ రిట్ అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల ట్యాలెంట్ ఆయ‌న సొంతం అని ప‌లువురు బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఎందుకంటే, కింది కోర్టులు మొద‌లుకొని సుప్రీంకోర్టు వ‌ర‌కు చంద్ర‌బాబు హ‌యాం

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (15:05 IST)
విజ‌య‌వాడ‌ : ఏపీ సీఎం చంద్ర‌బాబు కోర్టుల‌ను మ్యానేజ్ చేయ‌డంలో దిట్ట‌. ఏ రిట్ అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల ట్యాలెంట్ ఆయ‌న సొంతం అని ప‌లువురు బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఎందుకంటే, కింది కోర్టులు మొద‌లుకొని సుప్రీంకోర్టు వ‌ర‌కు చంద్ర‌బాబు హ‌యాంలో నియ‌మించిన వారే ఎక్కువమంది ఉన్నారు. హైకోర్టులో మొద‌లుకొని సుప్రీం కోర్టు జ‌స్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ వ‌ర‌కు అంద‌రితో చంద్ర‌బాబుకు మంచి ర్యాపో ఉంద‌ని, అందుకే ఆయ‌నకు స్టేలు సునాయాసంగా వచ్చేస్తాయ‌ని విమ‌ర్శలున్నాయి. 
 
కానీ, ఇటీవ‌ల రెండు కేసులు ఈ విమ‌ర్శ‌ల‌ను త‌ల‌కిందులు చేస్తున్నాయి. ఒక‌టి అమ‌రావ‌తి స్విస్ ఛాలెంజ్ కేసు, రెండోది కారెం శివాజీ కేసు. తాజా ఉదంతాల‌ను విశ్లేషిస్తే, ఎస్సీ, ఎస్టీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నియామ‌కం చెల్ల‌ద‌ని హైకోర్టు కొట్టేసింది. చంద్రబాబు ప్ర‌భుత్వం ఈ నియ‌మాకంలో స‌రిగా విధి విధానాల‌ను పాటించ‌లేద‌ని తీర్పు చెప్పింది. మరో ప‌క్క అమ‌రావ‌తి నిర్మాణంపై ఏపీ అనుస‌రించిన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కోర్టు కొట్టేసింది. అయితే, దీనికి ముందే రాష్ట్ర ప్ర‌భుత్వం మేల్కొని నోటిఫికేష‌న్ ర‌ద్దు చేసుకుని, చ‌ట్టంలో మార్పులు చేసుకుని త‌ప్పు స‌రిదిద్దుకున్నారు. 
 
ఇపుడు తాజాగా మాల‌మ‌హానాడు అధ్య‌క్షుడు కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ చేయ‌డాన్ని స‌వాలు చేస్తూ, ప్ర‌సాద్ బాబు అనే వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు విచారించింది. ఈ నియామకం చెల్ల‌ద‌ని, త‌గిన వ్య‌క్తిని వేరేవారిని నియ‌మించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి సూచించింది. పైగా ఈ తీర్పుపై అప్పీలుకు కూడా వెళ్ళ‌రాద‌ని తేల్చింది. ఇంత‌ ఘాటుగా ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చి తీర్పును చూసిన విమ‌ర్శ‌కులు, చంద్ర‌బాబు కోర్టుల‌ను మ్యానేజ్ చేస్తున్నార‌నే మాట‌పై నాలుక్క‌రుచుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments