Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు వ్యవసాయం అంటే అర్థం తెలుసా?: బుద్ధా వెంకన్న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే అర్థం తెలుసా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రైతుల పట్ల జగన్ మొ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (15:45 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే అర్థం తెలుసా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్‌పై తీవ్రస్థాయిలో బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఆదివారం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 14500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రైతుల బలవంతంగా లాక్కోలేదా? అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ భూదాహానికి 3 లక్షల మంది రైతులు రోడ్డునపడ్డారని విమర్శించారు.
 
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వివ‌రిస్తూ, రైతుల కష్టాలను తెలియ‌జెప్పుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.

రైతుల కష్టం మీకు కనిపించటం లేదా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇటు‌వంటి ఇబ్బందిక‌ర‌ సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక ప్ర‌భుత్వానికి లేదా? అని జగన్ లేఖ‌లో ఆవేద‌న వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments