Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్‌కు ఇంటికొచ్చి.. స్నేహితుడిని రక్షించి... ప్రాణాలు కోల్పోయిన బీటెక్ యువకుడు

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ యువకుడు.. సముద్ర స్నానానికెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు.

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (08:55 IST)
తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ యువకుడు.. సముద్ర స్నానానికెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి పెద్ద మసీదు సమీప ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రబ్బానీ (23) నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో గత ఏడాది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
రంజాన్‌ పండగకు హైదరాబాద్‌లోని స్నేహితులతో కలసి చిలకలూరిపేట వచ్చాడు. పండగ తర్వాత రోజైన మంగళవారం స్నేహితులతో కలసి ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం స్నేహితులందరూ సముద్రస్నానం చేస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మిత్రుడు అలలో కొట్టుకుపోవడం గమనించిన రబ్బానీ అతడిని రక్షించాడు. ఆపై అలలలో చిక్కుకున్న రబ్బానీ బయటకు రాలేక సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినా ప్రయోజనం లేదు. బుధవారం ఉదయం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments