ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బీఎస్పీ నేత‌లు భేటి..!

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) నేత‌లు హైద‌రాబాద్ లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం భేటి అయ్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన బీఎస్పీ రాజ్య‌స‌భ స‌భ్యులు శ్రీ వీర‌సింగ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు.

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (21:30 IST)
జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) నేత‌లు హైద‌రాబాద్ లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం భేటి అయ్యారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన బీఎస్పీ రాజ్య‌స‌భ స‌భ్యులు శ్రీ వీర‌సింగ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు. 
 
ఆయ‌న‌తో పాటు బీఎస్పీ ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల స‌మ‌న్వ‌యక‌ర్త శ్రీ గౌరీప్ర‌సాద్ ఉపాస‌క్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత శ్రీ బాల‌య్య‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసిన వారిలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల అమలులో జాప్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌రిణామాలపై చ‌ర్చించుకున్నారు.
 
సి.పి.ఐ ఏపీ కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన రామ‌కృష్ణ‌కు ప‌వ‌న్ అభినంద‌న‌లు..!
క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ‌కు కార్య‌ద‌ర్శిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన శ్రీ కె.రామ‌కృష్ణ‌కి జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌వ‌న్ క‌ళ్యాణ్ హృద‌య‌పూర్వక శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. కార్య‌వ‌ర్గానికి ఎన్నికైన ఇత‌ర స‌భ్యుల‌కు శుభాభినంద‌న‌లు. రామ‌కృష్ణ నాయ‌క‌త్వంలో సి.పి.ఐ అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిష్క‌రిస్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జ‌న‌సేన త‌న వంతు స‌హ‌కారం అందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా మ‌రోసారి హామీ ఇస్తున్నాన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments